నాగార్జునసాగర్ లో టూరిజం హెరిటేజ్ వాక్

May 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ -మే,20- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ టూరిజం వారోత్సవాలలో భాగంగా బుధవారం నాగార్జునసాగర్ లో హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యాటక అధికారి మహమ్మద్ అక్బర్ అలీ ఆధ్వర్యంలో స్థానిక టూరిజం విజయ విహార్ అతిథిగృహం ప్రాంగణంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ, స్థానికులు నజీర్, అనిల్ కుమార్, రాజగోపాల్, అడ్వకేట్ వినోద్ కుమార్, మల్లికార్జున, టూరిజం సిబ్బంది వెంకటస్వామి, అంజి, తులసిలతో పాటు స్థానిక వాకర్స్ పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper