అన్నచెల్లెళ్ల , అక్కతమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు.
జనం న్యూస్ ఆగస్టు 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి :రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదాలు, ఆప్యాయతలు తనకు ఎల్లప్పుడూ కొండంత బలాన్ని ఇస్తాయని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడంలో వారి సహకారం, ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు.రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులందరికీ అండగా ఉంటూ, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నాచెల్లెళ్ల , అక్కతమ్ముళ్ల అనుబంధం చిరకాలం వర్ధిల్లాలి ప్రతి ఇంటా ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలనీ. వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలిపారు.