అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్

August 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, ఆగస్టు 28: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ గ్రామంలో రక్షాబంధన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. పరస్పరం రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సోదరీమణులు కట్టే రాఖీ అన్నదమ్ములకు కొండంత బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, సంతోషాలను నింపే రక్షాబంధన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలకు సేవ చేయడంలో కుటుంబ సభ్యులు, సోదరీమణుల సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ కొండంత బలాన్ని ఇస్తాయని తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper