అన్నా నీకు రక్షణ హెల్మెట్

August 28, 2026 | వైరల్ వార్తలు

రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు* … *నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్ ధరించండి


-రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ శుభాకాంక్షలు

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ తేదీ 28 -08-2026 సంగారెడ్డి జిల్లా: ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రేమకు రాఖీ బంధం ప్రతీక అయితే… బాధ్యతకు హెల్మెట్ ప్రతీక కావాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ ఎస్పీ హృదయపూర్వక రక్షా బంధన్ శు భాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.రాఖీ కట్టే చెల్లి కోసం… ప్రాణాలను కాపాడే హెల్మెట్”చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం… నువ్వు ధరించే హెల్మెట్ నీ ప్రాణానికి రక్షణ కవచం” అని ఎస్పీ సందేశమిచ్చారు.రాఖీ కట్టించుకునే ప్రతి సోదరుడు తన చెల్లి ప్రేమను, కుటుంబం పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు… నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్ ధరించండి. ఇంటి నుంచి బయలుదేరిన మీరు క్షేమంగా తిరిగి రావడమే మీ కుటుంబానికి ఇచ్చే అసలైన రాఖీ కానుక.” అని ఎస్పీ పేర్కొన్నారు. కార్లు నడిపే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, మహిళలు అధికంగా సంచరించే ప్రదేశాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎవరైనా మహిళలు లేదా బాలికలను వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా ప్రజలు వెంటనే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని సూచించారు.అల్బనాని “మీ భద్రతే మా బాధ్యత… మీ సహకారమే మా బలం” రాఖీ పౌర్ణమి పండుగను ప్రతి కుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. పండుగ వేళ ప్రయాణాలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.

🌐 Select Language:
📰 ePaper