మార్కండేయ మందిరం లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

August 28, 2026 | తెలంగాణ

“నేను నీకు రక్షా – నీవు నాకు రక్షా… మనమందరం కలిసి దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షా”

బిచ్కుంద, ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయ మందిరం – భారతమాత మందిరంలో రక్షాబంధన్ మరియు జంధ్యాల పౌర్ణిమ వేడుకలను పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మశాలీయులు పరస్పరం రక్షా బంధనాలు కట్టుకుని “నేను నీకు రక్షా – నీవు నాకు రక్షా… మనమందరం కలిసి దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షా” అనే సందేశాన్ని చాటారు. అనంతరం జంధ్యాలను ధరించారు. రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితమైన పండుగ కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, పరస్పర విశ్వాసం, ఐక్యత, సామాజిక బాధ్యతను పెంపొందించే పవిత్రమైన సంప్రదాయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కండేయ మందిరం అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు హన్మండ్లు పద్మశాలి సంఘం డివిజన్ కార్యదర్శి డా రాజు మాలేగామ హన్మండ్లు కోశాధికారి ప్రతాప్ షేర్ల బాలరాజు మాలేగామ శ్రీనివాస్ రచ్చ శివకాంత్, భూమయ్య వంగ నర్సింలు, షేర్ల లక్ష్మణ్ అంబటి బాలరాజ్, మాలేగాం గంగాధర్ బోడ అంజయ్య వెంకటేశం మెడికల్ గంగాధర్, లక్ష్మణ్ తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు.రక్షాబంధన్ వేడుకల సందర్భంగా మందిర ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సామాజిక వాతావరణం నెలకొంది. పరస్పరం రక్షలు కట్టుకుని, దేశం, ధర్మం, సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

🌐 Select Language:
📰 ePaper