బుద్ధవనం సందర్శన మహా అద్భుతం…. హైకోర్టు న్యాయమూర్తి సామ్ కోషి

August 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్-ఆగస్టు 28- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లోని బుద్దవనం సందర్శన మహా అద్భుతమని ఒకసారి చూస్తే మర్చిపోలేని బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సామ్ కోషి అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్ పర్యటనలో భాగంగా విజయ విహార్ అతిధి గృహానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు నిడమనూరు కోర్టు న్యాయమూర్తి పృథ్వీరాజ్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధ వనంలోని బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూప వనాలను సందర్శించారు. అనంతరం మహాస్తూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్దవనం విశేషాలు తెలిపే లఘు చిత్రాని వీక్షించారు. మహా స్తూపం ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించిన అనంతరం బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర లు బుద్ధ వనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యాం వివరాలను,బుద్దవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు సాగర్ ఎస్ ఐ సతీష్, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎస్ ఐ గురునాధం, కోర్టు సిబ్బంది ఖాళీక్ తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper