బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణ మూర్తి చేతుల మీదుగా బెంగాల్ యువకులకు సన్మానం
జనం న్యూస్ ఆగస్టు 29 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)అల్లవరం మండలంలో ఇటీవల ఓడలరేవు కొమరగిరి పట్టణానికి చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైన విషయం తదితమే.. ఆ గల్లంతైన మద్యకారులను మానవతా దృక్పథంతో కాపాడిన పశ్చిమబెంగాల్ యువకులు బెoడమూర్లంక సెంటర్ కి రావడంతో ఆ పశ్చిమ బెంగాల్ ముగ్గురి యువకులను బిజెపి అల్లవరం మండలం తరపున సన్మానించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.. ఆ ముగ్గురి యువకుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్ మండల అధ్యక్షుడి గా ఉండడం గమనార్హం… దేశ సేవలో అయినా మానవతా సేవలో అయినా ముందుండి నడిపించే వారిలో బిజెపి ముఖ్యపాత్ర ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరుగుతుంది…ఈ కార్యక్రమంలో SIR (సర్) కన్వీనర్ సంసాని రత్నకుమార్ (SIR) కో కన్వీనర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు వాసంశెట్టి దుర్గ వరప్రసాద్ బజరంగ్దళ్ నాయకులు పట్టా నాగరాజు చిట్టూరి సత్యమధు గంటా సత్తిబాబు కోపనాతి శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు