నందలూరు జెడ్పి హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో ‘సెంట్రల్ కిచెన్’ నిర్మాణం వద్దు
సిటిజన్స్ అసోసియేషన్ డిమాండ్
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 30, ఆగస్టు 2026నందలూరు మండలానికి మంజూరైన ‘సెంట్రల్ కిచెన్’ (స్మార్ట్ కిచెన్) నిర్మాణాన్ని నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో కాకుండా వేరొక అనుకూలమైన స్థలానికి మార్చాలని ‘సిటిజన్స్ అసోసియేషన్’ (విద్య, సాంస్కృతిక, క్రీడ మరియు సేవా సంస్థ) రాజంపేట సబ్‌కలెక్టర్‌ను కోరింది.పాఠశాల మైదానంలో సెంట్రల్ కిచెన్ నిర్మించడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవు తాయని అసోసియేషన్ నాయ కులు ఎ.విశ్వనాథ్ ప్రధాన కార్య దర్శి సయ్యద్ అమీర్,ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నిర్మాణంతో క్రీడా ప్రాంగణం చిన్నదై విద్యా ర్థులు ఆటలు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారడమే కాకుండా, పరిశుభ్రత లోపించి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, నీరు నిలిచిపోయి మైదానం పూర్తిగా దెబ్బతింటుంది.వంటలపొగ
శబ్దాల వల్ల పక్కనే ఉన్న తరగతి గదుల్లో పాఠాల బోధనకు,విద్యార్థుల చదువుకు తీవ్ర విఘాతం కలుగుతుంది అని. దీనికి తోడు తయారు చేసిన భోజనాన్ని వాహనాల్లో బయటకు తరలించడానికి చుట్టుపక్కల వీధి రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి అని.కాబట్టి, విద్యార్థుల భవిష్యత్తును మరియు పాఠశాల వాతావర ణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ‘సెంట్రల్ కిచెన్’ నిర్మాణాన్ని వెంటనే వేరొక అనుకూలమైన ప్రదేశానికి మార్చాలని సిటిజన్స్ అసోసియేషన్ వారు సబ్‌కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.