ఘనంగా జరిగిన తెలుగు భాష, క్రీడా దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ నందలూరు, కడప జిల్లా ఆగస్టు 30 మండలంలోని నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల జూనియర్ కళాశాలలో శనివారం సాయంత్రం నిర్వ హించిన తెలుగు భాష క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.పాఠశాల ప్రధానోపాధ్యా యులు గంగనపల్లి వెంకటరమణ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.వ్యవహారిక భాషా ఉద్యమపితామహుడు గిడుగు రామమూర్తి పంతులు, హాకీమాంత్రికుడుమేజర్,ధ్యాన్,చంద్,చిత్రపటాలకు ఉపాధ్యా యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సంద ర్భంగా ప్రధానోపాధ్యా యులు గంగనపల్లి వెంకట రమణ మాట్లా డుతూ కేవలం పండితులకు మాత్రమే పరి మితమైన గ్రాంథిక భాషను పామరులకు సైతం చేరువ చేసేందుకు గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషి శ్లాఘనీయ మని పేర్కొ న్నారు.హాకీ మాంత్రి కుడుగా పేరు పొందిన మేజర్ ధ్యాన్ చంద్ ఒలింపిక్ క్రీడలలో తన ప్రజ్ఞ పాటవాలను ప్రదర్శించి దేశ గౌరవాన్ని ఇనుమడింప చేశార న్నారు.ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయురాలు జి. గీత, 10వ తరగతి విద్యార్థి సయ్యద్ ఉమర్ ఉస్మాన్ అలీ జిల్లా స్థాయి లోనూ రాష్ట్ర స్థాయిలోనూ హైజంప్, షాట్ పుట్ లలో ప్రతిభ చూపిన కారణంగా వారిని శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరిం చారు.ఈ కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయులు గ్లోరీ కిరణ్ ఉజాల, సిద్ధవటం రెడ్డి ప్రసాద్, రవిశంకర్ రెడ్డి,నాగిశెట్టి లక్ష్మీనారాయణ, బోగావెంకట సుబ్బయ్య, విజయ కుమారి,వల్లూరు మస్తాన్, రాజేంద్ర, దీపాల సురేష్, సుమలత, వెంకట రమణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.