నందలూరు పరిధిలోని ఎర్రిపాపయ్యగారిపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు.

September 1, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్.ఆదేశాల మేరకు నందలూరు ఎస్‌.ఐ వి.మల్లిఖార్జున రెడ్డి ఆధ్వర్యం లో పోలీసు సిబ్బంది నందలూరు మండలంలోని ఎర్రిపాపయ్యగారి పల్లి గ్రామాన్ని సందర్శించి స్థానికులతోసమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎలాంటి గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల భద్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ప్రజల సహకారంతో ప్రశాంత మైన, సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్‌.ఐ మల్లిఖార్జున రెడ్డి పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper