జిల్లా స్పోక్స్‌పర్సన్‌గా బత్తుల నరేష్ నియామకం
ఘనంగా సన్మానించిన సురక్ష హాస్పిటల్ రమేష్ రెడ్డి
జనం న్యూస్, సెప్టెంబర్ 1, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్‌పర్సన్‌గా నియమితులైన మెట్పల్లి 3వ వార్డు కౌన్సిలర్ బత్తుల నరేష్‌ను సురక్ష హాస్పిటల్ రమేష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా స్పోక్స్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన బత్తుల నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని రమేష్ రెడ్డి ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో బత్తుల నరేష్ కీలక పాత్ర పోషించాలని కోరారు.ఈ సందర్భంగా బత్తుల నరేష్‌కు శాలువా కప్పి సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు