బీజేపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్‌గా ఉప్పు రాజు నియామకం

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్‌గా శాయంపేట మండలానికి చెందిన ఉప్పు రాజును బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి నియమించారు.గత 30 సంవత్సరాలుగా బీజేపీ కార్యకర్తగా పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న ఉప్పు రాజు, బీజేపీ మండల కార్యవర్గ సభ్యుడిగా, మత్స్యశాఖ మండల కన్వీనర్‌గా, ఓబీసీ జిల్లా సహకార దర్శిగా, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీ కోసం ఆయన అందించిన దీర్ఘకాలిక సేవలను గుర్తించి బీజేపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్‌గా ఈ బాధ్యతను అప్పగించారు.ఈ సందర్భంగా జిల్లా కార్మిక విభాగం కన్వీనర్‌గా నియమితులైన ఉప్పు రాజు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందె శ్రీనివాస్ కి, భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి కి, సత్యపాల్ గారికి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలందరికీ ఉప్పు రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ జిల్లాలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పు రాజు తెలిపారు. కార్మిక వర్గానికి బీజేపీ అండగా నిలిచేలా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్మికులకు అందుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.