రామచంద్రపురంలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సుభాష్
లబ్ధిదారులతో ఆప్యాయంగా మమేకమైన మంత్రి సుభాష్
జనం న్యూస్ సెప్టెంబరు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ పాలనకు మూలస్తంభంరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో భరోసా నింపుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం పట్టణంలోని క్లస్టర్-2 పరిధిలోని 8, 9 వార్డుల్లో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సుభాష్, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్ రాజుతో కలిసి పాల్గొని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఒకటో తేదీనే తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల గడప వద్దకు వెళ్లి పెన్షన్లు అందించడం కూటమి ప్రభుత్వ సంక్షేమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆర్థిక పరిస్థితులు ఎంత సవాలుగా ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి రాజీ పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యమని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపిస్తున్నామని మంత్రి సుభాష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, ఉపాధ్యక్షులు చందమామ వాసు, క్లస్టర్-2 ఇన్చార్జి కంచుమర్తి బాబురావు, నారపురెడ్డి బలరాం, కట్టా నాగేశ్వరరావు, కవల నానాజీ,గడి గోవిందు, ఏలూరు ఏసుదాసు, 8 వార్డు ప్రెసిడెంట్ చిక్కాల వీరస్వామి, 9 వార్డు ప్రెసిడెంట్ తొగర శ్రీను, టేకుమూడి రామకృష్ణ, నాగదేవర నాయుడు, శ్రీను, మనోజ్,కార్యకర్తలు, లబ్ధిదారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.