కాంగ్రెస్ హామీలపై ప్రజాక్షేత్రంలో పోరాటం
సెప్టెంబర్ 2 నుంచి డివిజన్ స్థాయి ప్రజా సమావేశాలు: బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి సతీష్ అరోరా
జనం న్యూస్ సెప్టెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ కూకట్పల్లి నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి సతీష్ అరోరా అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, వాటిపై ప్రజాక్షేత్రంలో నిరసన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాలతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.సెప్టెంబర్ 2వ తేదీ నుంచి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రజా సమావేశాలు నిర్వహించ నున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశాలకు కూకట్పల్లి నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఆయా డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు తీరుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.డివిజన్ల వారీగా సమావేశాల తేదీలు సెప్టెంబర్ 2: బోయినపల్లి డివిజన్ సెప్టెంబర్ 4: బాలానగర్ డివిజన్ సెప్టెంబర్ 5: బేగంపేట డివిజన్
సెప్టెంబర్ 6: ఫతేనగర్ డివిజన్ సెప్టెంబర్ 7: మూసాపేట్ డివిజన్ సెప్టెంబర్ 8: అల్లాపూర్ డివిజన్ సెప్టెంబర్ 9: బాలాజీనగర్, కేపీహెచ్బీ డివిజన్లు సంయుక్తంగా సెప్టెంబర్ 10: కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డివిజన్ స్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని రెడ్డి సతీష్ అరోరా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ హామీలపై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు.అలాగే కాంగ్రెస్ హామీలపై ఇంటింటికీ “బాకీ కార్డులు” చేరేలా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ప్రజలను చైతన్యపరచాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. డివిజన్ స్థాయి సమావేశాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.