ఆసుపత్రిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేత.

September 1, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ సెప్టెంబర్ 1 కోటబొమ్మాళి మండలం :మండలం కస్తూరిపాడు సచివాలయం పరిధిలో గల దుప్పలపాడు గ్రామానికి చెందిన తoగుడి లక్ష్మీకాంతం రెండు రోజుల కిందట అనారోగ్యంతో టెక్కలి జిల్లా ఏరియా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స కోసం చేరింది. మంగళవారం పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో ఆ విషయాన్ని తెలుసుకున్న కస్తూరి పాడు జూనియర్ లైన్మెన్ తోట గోపాలం టెక్కలి జిల్లా ఏరియా ఆసుపత్రి కీ వెళ్లి తంగుడు లక్ష్మీకాంతం కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశారు. దీంతో లక్ష్మీకాంత కుటుంబం ఎంతో ఆనందంతో గోపాలంకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న సమయంలో ఆస్పత్రికి వచ్చి పెన్షన్ ఇవ్వడం ఎంతో సహాయం చేసినట్టు అనిపించిందనీ ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే అవార్డు అందుకున్న గోపాలం సేవాభావంకు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper