భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం ఉండాలి వ్యవసాయ అధికారి

May 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 21 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భూసార పరీక్షల ఆధారంగానే రైతులు తమ పొలాల్లో ఎరువులు వినియోగించాలని మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్ రెడ్డి సూచించారుగురువారం నందిన్నె గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నార్మ్, మరియు ఐఎఫ్ఎఫ్సీవో సంస్థల సహకారంతో రైతు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు సమతుల్య ఎరువుల వినియోగం నేల పరీక్షల ప్రాముఖ్యత నేల పరీక్ష ప్రదర్శన బయో ఫెర్టిలైజర్ల వినియోగం నానో ఎరువులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నార్మ్ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకట కుమార్ డాక్టర్ సురేష్ కుమార్ డాక్టర్ మురళీ కృష్ణ రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువుల వినియోగంపై వివరించారు. ఐఎఫ్ఎఫ్ సిఓ మేనేజర్ రాజు నానో ఎరువుల ప్రయోజనాలను వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ ఉప సర్పంచ్ తాయ్ రెడ్డి రైతులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper