ఆపదలో అపర సంజీవని 108 అర్ధరాత్రి సమయంలో గర్భిణీకి సాధారణ ప్రసవం చేసిన 108 సిబ్బంది

May 21, 2026 | ఆంధ్రప్రదేశ్

108 సిబ్బందిని అభినందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు

జనం న్యూస్ -మే 21- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ హిల్ కాలనీలో పురిటి నొప్పులు అధికమై 108 అంబులెన్సులో ప్రసవించిన మహిళ, ఇఎంటి రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన ఎస్.కె మెహర్ఉన్నిసా బేగం(35) భర్త పేరు ఎస్ కే చాంద్ బాషా పుటినొప్పులతో కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రికి రాగా ఆమెను పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం నల్లగొండ గొల్లగూడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో అర్ధరాత్రి 11:40 సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో ఇఎంటి రాకేష్ పైలట్ గణేష్ లు తక్షణమే స్పందించి ఇ ర్ సిపి (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఫిజీషియన్) డాక్టర్ మౌనిక సూచనలతో సుఖ ప్రసవం చేశారు. మహిళకు పండంటి మగ బిడ్డ పుట్టడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు, తదుపరి చికిత్స కోసం తల్లి బిడ్డను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 ఇఎంటి రాకేష్ తెలిపారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించి బాధిత మహిళకు సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper