జాతీయ రహదారి 161 పై ఘటన

డివైడర్ ను ఢీకొన్న బస్సు –
డ్రైవర్ మృతి 14మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
జుక్కల్ సెప్టెంబర్ 4 ( జనం న్యూస్)కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా 161వ జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జుక్కల్ చౌరస్తా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.బస్సు కండక్టర్ కు తీవ్ర గాయాలైనయ్
బస్సులో ప్రయాణిస్తున్న14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి వారిని బిచ్కుంద ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.సంఘటన స్థలంలో బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సీఐ, జుక్కల్ ఎస్సై చేరుకున్నారు. .