ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సత్కరించిన సైబరాబాద్ సీపీ

September 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గచ్చిబౌలిలో జెడ్ పీ హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం – విద్యార్థులతో ముఖాముఖిఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం. రమేష్, ఐపీఎస్, గచ్చిబౌలిలోని జెడ్ పీ హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ,ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువు” అని అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. “విద్యార్థులు ఉన్నతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ఉపాధ్యాయులకు మనం అందించే గొప్ప బహుమతి” అని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, రోడ్డు భద్రత, ట్రాఫిక్, మహిళల భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడంలో ఉపాధ్యాయులు, పోలీసులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు సమాజంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థి జూడ్ ప్రశ్నవిద్యార్థి జూడ్ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని కోరాడు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించేలా అవగాహన కల్పించాలని సీపీని కోరాడు.విద్యార్థి ప్రశ్నకు స్పందించిన సీపీ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.మహిళల భద్రతపై విద్యార్థిని ప్రశ్నవిద్యార్థిని స్నేహిత మహిళలు, బాలికల భద్రత కోసం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీపీని ప్రశ్నించగా, సీపీ బదులిస్తూ మహిళలు, బాలికల రక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు లేదా బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే డయల్ 100 లేదా 112 కి ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని సూచించారు.
డ్రగ్స్ పై విద్యార్థులు ప్రశ్నకొంతమంది విద్యార్థులు తమ పాఠశాలకు వచ్చే మార్గంలో కొందరు వ్యక్తులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు కనిపిస్తున్నారని సీపీ దృష్టికి తీసుకువచ్చారు.సీపీ స్పందిస్తూ డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు ఇలాంటి కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తాము డ్రగ్స్‌ కు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులను కూడా డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని తెలిపారు. అదేవిధంగా, రోడ్డు దాటే సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి వారి సహాయం తీసుకోవాలని విద్యార్థినులకు సీపీ సూచించారు.సైబర్ మోసాలపై విద్యార్థి నిఖిల్ ప్రశ్నవిద్యార్థి నిఖిల్ మాట్లాడుతూ ఒక రోజు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఓటిపి చెప్పాలని కోరగా, ఓటిపి చెప్పిన వెంటనే తన ఖాతా నుంచి రూ.4,000 డెబిట్ అయ్యాయని సీపీ దృష్టికి తీసుకువచ్చాడు. ఇలాంటి మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలని ప్రశ్నించాడు.స్పందించిన సీపీ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి బ్యాంక్ వివరాలు, పిన్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారంఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను సీపీ డా. ఎం. రమేష్ ఘనంగా సత్కరించారు. హెచ్ ఎమ్ రెహానా బేగం, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ ను ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ రాయదుర్గం ఎస్ హెచ్ ఓ భూపతి, పోలీసు అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper