హమారా ప్రసాద్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి

September 9, 2026 | తెలంగాణ

కాట్రేనికోన మాల మహానాడు జేఏసీ డిమాండ్‌


జనం న్యూస్ సెప్టెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగులారపు ప్రసాద్‌ అలియాస్‌ హమారా ప్రసాద్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాట్రేనికోన మండల మాల మహానాడు జేఏసీ డిమాండ్‌ చేసింది.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తూ, ఆయనను కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కాట్రేనికోనలో జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రపంచస్థాయి మహానాయకుడని, భారతదేశానికి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని నాయకులు పేర్కొన్నారు. కోట్లాది మంది బడుగు, బలహీన వర్గాలకు ఆయన దిక్సూచిగా నిలిచారని తెలిపారు. అటువంటి మహనీయుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికైనా పోలీసులు స్పందించి హమారా ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టప్రకారం తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాట్రేనికోన పోలీసు శాఖ అధికారులను జేఏసీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ దళిత నాయకులు ఇసుపట్ల రాంబాబు, జగడం బాలయోగి, మోకా అప్పాజీ, అడ్వకేట్‌ కాశి హనుమంతరావు, వడ్డీ శ్యాంప్రసాద్‌, అయితా బత్తుల శ్రీనుబాబు, నందిక శ్రీను, ఆర్‌పీఐ జిల్లా కార్యదర్శి ఉచ్చిల సాల్మన్‌ రాజు, వరసాల చిన్నారావు, బూసి రాంబాబు, నల్లా రాంబాబు, బొంతు దుర్గాప్రసాద్‌, పెయ్యిల ప్రసాద్‌, కాశి భరత్‌, కొంకి శ్రీను,..కందికుప్ప జనసేన నాయకులు బళ్ళ కుమార్, వజ్రపు శరత్,తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper