సొసైటీ ఎన్నికల్లో ట్రెజరర్‌గా నవీన్ ఘన విజయం.

September 10, 2026 | తెలంగాణ

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

జనం న్యూస్ సెప్టెంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన సొసైటీ ఎన్నికల్లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నవీన్ ట్రెజరర్‌గా ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో ఆయనకు లభించిన మద్దతుతో సహచర పోలీసు సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
నవీన్ విజయం సాధించిన విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సహచరుల నమ్మకాన్ని నిలబెట్టుకుని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం అందరితో సమన్వయంతో పనిచేస్తానని నవీన్ పేర్కొన్నారు. తనతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper