ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు – గుత్తుల సాయి

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్ల నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేసిన జిల్లా అధికారులు, పోలీసు శాఖ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ అందించిన సహకారం, సమన్వయం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper