చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: జన్నే మొగిలి
జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జన్నే మొగిలి మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పేదలు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ, ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.సామాజిక న్యాయం, పేదల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని జన్నే మొగిలి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి, సీనియర్ నాయకులు వనం దేవరాజ్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్, భూత అధ్యక్షులు పున్నం సాంబయ్య, కడారి చంద్రమౌళి, ఎర్ర రాకేష్ కార్యకర్తలు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.