ఐలమ్మ విగ్రహానికిపూలమాల వేసిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్.

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు సెప్టెంబర్ 10-09-2026 గురువారం తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులర్పించారు. గురువారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.తెలంగాణ మట్టి ఆత్మగౌరవాన్ని, పేదల భూమి హక్కులను కాపాడేందుకు భూస్వాములపై ఎదురొడ్డి నిలిచిన వీరమాత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రజాకార్లు, దొరల అరాచకాలపై రోకలి బండ చేత పట్టుకుని పోరాడిన ఆమె ధీరత్వం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ చూపిన పోరాట బాట సమాజంలో హక్కుల సాధనకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొంతం దయాకర్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, షకీల్,యుగేందర్ రెడ్డి,రజక నరసింహ,పెద్ద రాములు, సునీల్ రెడ్డి,రజక సంఘం సభ్యులు సూరయ్య,జయన్న,ఆర్. రాముడు, యం.దస్తగిరి, బాలయ్య,ఇ. సురేష్, పారిజాత, చంద్ర శేఖర్ పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper