అక్రమ బ్లాస్టింగ్ క్రషర్ మిషన్ ను నిలిపివేయాలి.

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 10 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల ఆర్డిఓ కి వినతిపత్రం అందజేసిన తెలంగాణ రక్షణ సేన గద్వాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ గద్వాల: గట్టు మండలం సల్కాపురం గ్రామ సమీపంలో ఏర్పాటుచేసిన భారత్ మాల ప్రాజెక్టు క్రషర్ మిషన్ కంపెనీని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.సల్కాపురం గ్రామ సమీపంలో ఉన్న క్రషర్ మిషన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం గద్వాల ఆర్డిఓ శ్రీనివాసులు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూక్రషర్ మిషన్ ఏర్పాటు చేయడం ద్వారా అనేకమంది శ్వాసకోస వ్యాధితో ప్రమాదానికి గురవుతున్నారని, ఆయా గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని తెలిపారు నియమ నిబంధనలు పాటించకుండా క్రషర్ మిషన్ నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ పొలానికి రైతుల పొలాలో బోర్లు పూర్తిగా ఎండిపోయిన దుస్థితి నెలకొందని తెలిపారు. దీంతో అదే గ్రామానికి చెందిన రైతు చేసేదేమీ లేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు క్రషర్ మిషన్ నిర్వాహకులు బ్లాస్టింగ్ చేయడం ద్వారా పక్క పొలాల్లో ఉన్న రైతులపై పెద్దపెద్ద రాళ్లు ఎగిరి పడడంతో అనేకమంది రైతులు ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అక్రమ బ్లాస్టింగ్ ను నిలిపివేయాలని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. చెట్టు ప్రక్క గ్రామాల ప్రజలను ఆర్థికంగా సామాజికంగా నష్టానికి గురి చేస్తున్న క్రషర్ మిషన్ యాజమాన్యంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా అధికారులు మాత్రం నమ్మకం నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు ఈ వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా లేక అధికారుల హస్తం ఉన్నదా పూర్తిగా విచారణ జరిపించి అట్టి క్రషర్ మిషన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు.నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ సైలెంట్ బ్లాస్టింగ్ చేయకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారనిళఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేసి భూ పరీక్షలతో పాటు పొల్యూషన్ టెస్ట్ నిర్వహించాలనితెలిపారు. దీనికి ప్రత్యేకంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి ఉండాలన్నారు.ఇచ్చిన అనుమతుల కంటే అదనంగా క్రషింగ్ కు పాల్పడుతూ పక్క రాష్ట్రాలకు ఇట్టి కంకరను అక్రమంగా తరలిస్తున్నారని మాట్లాడారు.
ఈ విషయంపై గద్వాల ఆర్డిఓ సమక్షంలో టాస్క్ ఫోర్స్ కమిటీ బృందంతో తనిఖీలు నిర్వహించి, అక్రమ బ్లాస్టింగ్ నిలిపివేయడమే కాక, రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు బుచ్చిబాబు విష్ణు బలరాం నాయుడు వెంకట్రాములుమల్దకల్ అడవి ఆంజనేయులు జమ్మన్న,ఆశన్న జగదీష్ లక్ష్మన్న గొర్ల తిమ్మప్ప, మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper