ఐజ మున్సిపల్ పట్టణంలో తేది:10-09-2026.తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ. 41.వ. వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి
జనం న్యూస్ 10 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఐజ మున్సిపాలిటీ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత అమరజీవి చిట్యాల చాకలి ఐలమ్మ 41.వ వర్ధంతి ఆమె త్యాగం తెలంగాణ సాయుధ పోరాట వీరనారి భూపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ త్యాగం ను ప్రజలను చైతన్యం చేయాలని పురస్కరించు కొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టి ఆర్ పి) నాయకులు అయిజ రాయచూర్ కర్నూల్ చౌరస్తాలో ఐలమ్మ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో టి ఆర్ పి జోగులాంబ గద్వాల జిల్లా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు గంగాధర్ మాట్లాడుతూ నాటి నిజాం భూస్వామ్య రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తన భూమి భుక్తి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వెట్టిచాకిరీ విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన వీరోచిత పోరాటాన్ని నేటి తరం స్మరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ టి ఆర్ పి విజయవంతం చేశారు.