భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్
జనం న్యూస్- సెప్టెంబర్ 10- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులు పెద్దవూర మండల యూత్ ప్రెసిడెంట్ కోడా విజయ్, సునీల్ కుమార్ లను అరెస్టు చేసి విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు,ఈ సందర్భంగా కోడా విజయ్ మాట్లాడుతూప్రజాపాలన అని చెప్పి అరెస్టుల పాలన కొనసాగిస్తున్నారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, విద్యార్థుల నిరసన హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.ప్రశ్నిస్తే అరెస్టులేనా?అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలను అరెస్టు చేయించడం, విద్యార్థులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులను అరెస్టు చేయించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులు కూడా ప్రభావితమవుతున్నాయని అన్నారు.విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన చేపట్టకముందే ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు.అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థుల ఉద్యమాలను అడ్డుకోలేరని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటం కొనసాగుతుందని కోడా విజయ్ స్పష్టం చేశారు.విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి,ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, అక్రమ అరెస్టులను నిలిపివేయాలి.