మళ్లీ మొదలైన అరెస్టులు ప్రశ్నిస్తే అరెస్టులు రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదా
జనం న్యూస్ సెప్టెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బిఆర్ఎస్ నుండి ఎటువంటి పిలుపునివ్వకుండా కూడా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ను ఉదయం 5 గంటలకే పోలీస్ స్టేషన్ కు తరలించి ముందస్తు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో గత 1000 రోజుల నుండి రాక్షస పాలన నడుస్తుందని ఎక్కడికక్కడ అరెస్టులు నిర్బంధాలు విధిస్తున్నారని ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని ఆశా వర్కర్లకు కనీస వేత నం కరెంటు స్పాట్ బిల్లర్ కి రేగ్యులైజేషన్ చేయడం లేదని కనీసం విద్యాశాఖకు మంత్రి నీ నియమించకుండా తన దగ్గరే ఉంచుకొని విద్యార్థులకు తీవ్ర మనో వేదన గురి చేస్తున్నారని విద్యార్థులకు 14 వేల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీలో సెషన్ ముగిసే వరకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి చర్యలు మానుకోవాలని రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని రాబోయే కాలంలో ప్రజల చేతిలో విద్యార్థుల చేతిలో ఉద్యోగస్తుల చేతిలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తుమం ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో కరెంట్ స్పాట్ బిల్లర్ కేతిపల్లి రఘుపతి రెడ్డి ఆశా వర్కర్లు యూనియన్ అధ్యక్షురాలు కోగిల స్రవంతి మంద అరుంధతి మారేపల్లి ప్రేమలత తదితరులు పాల్గొన్నారు…