తెలంగాణ

మండల మహిళా సమాఖ్యలో అసలు ఏం జరుగుతుంది

మండల మహిళా సమాఖ్యలో అసలు ఏం జరుగుతుంది

జనం న్యూస్ 17 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రెండు సార్లు మెమో.. ఒక సారి షోకాజ్ నోటీసు ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు డ్రా మండల మహిళా సమాఖ్య కార్యాలయంలోనే కానా పినా సోజానా.పట్టించుకొని సంబంధిత అధికారులు..జోగులాంబ గద్వాల జిల్లా కె టి దొడ్డి మండల ఏపీఎం పై గత రెండు నెలల నుంచి వస్తున్న అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో.. ఇట్టి విషయం వార్తా పత్రికల్లో ప్రచురించడంతో ఏపీఎం కు రెండు సార్లు మెమో ఒక సారి షోకాజ్ నోటీసు ఇచ్చామని డి ఆర్ డి ఏ పిడి ముసాయిదా బేగం చెప్పారు. కానీ ఇట్టి విషయం పై వివరాలు గోప్యంగా ఉంచారు. పలుమార్లు పత్రికా విలేకర్లు అడిగినా, చరవాణి ద్వారా ( వివరాల కోసం/ వివరణ కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యని డి ఆర్ డి ఏ పిడి ముసాయిదా బేగం ) ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది డి ఆర్ డి ఏ కార్యాలయానికి వెళ్ళి అడిగినా నేను మీటింగ్ ఉన్నా అని తెలివిగా చెప్పడం జరిగింది. పలుమార్లు ఫోన్ చేసిన ఎత్తడం లేదు పిడి మేడం ముసాయిదా బేగం డి ఆర్ డి ఏ సెర్ప్ ఏ పి డి శ్రీనివాస్ కూడా సమాధానం చెప్పడంలో తడబడుతున్నాడు. నిజంగా మెమోలు,సోకాజ్ నోటీస్ లు ఇచ్చారా లేఖ ఇచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నారా అనే సందేహం కలుగుతుంది. కే టి దొడ్డి మండల మహిళా సమాఖ్య లో అసలు ఏం జరుగుతుంది. ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలను మండల అకౌంటెంట్ వెంకటేష్ డ్రా చేసినట్టు, అందులో మూడు లక్షలు గువ్వల దీన్నే గ్రామ మహిళా పోదుపు సంఘాలకు ఇచ్చినట్టు, ఐదు వేల రూపాయలు మండల మహిళా సమాఖ్య కార్యాలయం రెంట్ కట్టినట్టు,మిగిలిన రెండు లక్షల యాభై వేల రూపాయలు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలోనీ బీరువాలో పెట్టినట్టు సమాచారం. ఏపీఎం అక్కడే తినడం, అక్కడే పడుకోవడం జరుగుతుంది. ఇట్టి విషయం పై అకౌంటెంట్ వెంకటేష్ ను వివరణ కోరితే.. పైన కనపరిచినట్టు చెప్పడం జరిగింది. మిగిలిన డబ్బులు కార్యాలయంలో ఎందుకు పెట్టారు అని అడిగితే.. అదే నేను చేసిన తప్పు అని వంకర సమాధానం చెప్పడం జరిగింది.ఇక ఏపీఎం ఇట్టి విషయం పై మౌన వ్రతం చేస్తున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా మౌనవ్రతంలోనే ఉండిపోయారు. ఇట్టి విషయం జిల్లా సంబంధిత అధికారులు అయిన డి ఆర్ డి ఏ పిడి అధికారి ముసాయిదా బేగం మరియు డి ఆర్ డి ఏ సెర్ప్ ఏ పి డి అధికారి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లినా వారు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు.

ఇ-పేపర్