తెలంగాణ

రేషన్‌కు ఫింగర్‌ప్రింట్‌.. ఓటుకు ఎందుకు కాదు

రేషన్‌కు ఫింగర్‌ప్రింట్‌.. ఓటుకు ఎందుకు కాదు

జనం న్యూస్ 17 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ ప్రతి సంక్షేమ పథకానికిబయోమెట్రిక్‌ ధృవీకరణ ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటుకు ఎందుకు ఉండకూడదు నకిలీ ఓట్లకు చెక్‌ పెట్టే ఫింగర్‌ప్రింట్‌ ఓటు పై చర్చ మొదలుకావాలి రేషన్‌కు ఫింగర్‌ప్రింట్‌ ఓటుకు ఎందుకు కాదు నకిలీ ఓట్లకు చెక్‌ పెట్టేందుకు బయోమెట్రిక్‌ ఓటరు ధృవీకరణపై దేశవ్యాప్త చర్చ అవసరం ఒక వ్యక్తి, ఒక ఓటుకు ఫింగర్‌ప్రింట్‌ రక్షణ సాంకేతికతను వినియోగించాలి కానీ ఓటు గోప్యతకు పూర్తి భద్రత ఉండాలి దొంగ ఓట్లకు తాళం ఓటరుకు బయోమెట్రిక్‌ గుర్తింపు సంక్షేమ పథకాల్లో ఫింగర్‌ప్రింట్‌ ఉంటే ప్రజాస్వామ్య ఓటుకు ఆధునిక ధృవీకరణపై ఎందుకు ఆలోచించకూడదు రేషన్‌ నుంచి పెన్షన్‌ వరకు బయోమెట్రిక్‌. మరి ఓటు విషయంలో ఎందుకు వెనుకడుగు ఒకరి పేరుతో మరొకరు ఓటు వేయకుండా సాంకేతిక అడ్డుకట్ట సాధ్యమేనా ఓటరు ఎవరో తెలుసుకోవాలి కానీ ఎవరికి ఓటు వేశారో మాత్రం తెలియకూడదు
ఫింగర్‌ప్రింట్‌ విఫలమైనా ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యామ్నాయ ధృవీకరణ తప్పనిసరి.బయోమెట్రిక్‌ ఓటింగ్‌ అమలుకు ముందు గోప్యత డేటా భద్రత రాజ్యాంగ హక్కులపై సమగ్ర పరిశీలన అవసరం రాజకీయ పరిశోధన పాత్రికేయులు
పర్కాల సమ్మయ్య గౌడ్:8919849990:8106006300:రేషన్‌ బియ్యం తీసుకోవాలంటే ఫింగర్‌ప్రింట్‌ పెన్షన్‌ పొందాలంటే బయోమెట్రిక్‌ ధృవీకరణ ప్రభుత్వంలోని అనేక సేవలు లబ్ధుల్లో లబ్ధిదారుడి గుర్తింపును నిర్ధారించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. మరి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు వేసే సమయంలో మాత్రం ఓటరు గుర్తింపును మరింత పటిష్టంగా నిర్ధారించే సాంకేతిక వ్యవస్థ ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు రావాల్సిన అవసరం ఉంది.ఒక వ్యక్తి ఒక ఓటు మరింత పటిష్టం కావాలి ఎన్నికల సమయంలో నకిలీ ఓట్లు ఇతరుల పేర్లతో ఓటు వేయడం ఒకే వ్యక్తికి బహుళ ఓటరు నమోదులు వంటి ఆరోపణలు తరచూ రాజకీయ చర్చకు వస్తుంటాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఓటరు జాబితాల శుద్ధితో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చో ఎన్నికల వ్యవస్థ పరిశీలించాల్సిన అవసరం ఉంది.బయోమెట్రిక్‌ ధృవీకరణ ద్వారా ఓటరు నిజమైన వ్యక్తేనని నిర్ధారించి, ఒకసారి ఓటు వేసిన తర్వాత అదే గుర్తింపుతో మరోసారి ఓటు వేసే అవకాశం లేకుండా చేయగలమా అన్నదే అసలు ప్రశ్న.ఫింగర్‌ప్రింట్‌ ఓటు ఎవరికి అన్నది కాదు ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఓటు గోప్యత.బయోమెట్రిక్‌ వ్యవస్థను అమలు చేసినా ఫింగర్‌ప్రింట్‌ ద్వారా ఓటరు ఎవరో మాత్రమే ధృవీకరించాలి. ఆ ఓటరు ఎవరికి ఓటు వేశాడన్న సమాచారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయోమెట్రిక్‌ డేటాతో అనుసంధానం కాకూడదు. అంటే ఓటరు గుర్తింపు ఉండాలి ఓటు గోప్యత ఉండాలి.రెండూ ఒకదానితో ఒకటి కలవకూడదు దొంగ ఓటుకు సాంకేతిక తాళం ఒకరి పేరుతో మరొకరు ఓటు వేయకుండా నిరోధించడం బహుళ నమోదులను గుర్తించడం ఓటరు ఒకసారి మాత్రమే ఓటు వేసేలా నిర్ధారించడం వంటి అంశాల్లో బయోమెట్రిక్‌ సాంకేతికతను పరిశీలించ వచ్చు. అయితే ఫింగర్‌ప్రింట్‌ ఒక్కటే ఎన్నికల అక్రమాలకు సంపూర్ణ పరిష్కారం కాదు. ఓటరు జాబితాల శుద్ధి, డూప్లికేట్‌ నమోదుల తొలగింపు, చిరునామా ధృవీకరణ పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ సాంకేతిక భద్రత వంటి అంశాలు కూడా సమాంతరంగా బలోపేతం కావాలి.వృద్ధులు కూలీలు బయోమెట్రిక్‌ విఫలమైతే ఫింగర్‌ప్రింట్‌ ఆధారిత వ్యవస్థలో మరో సవాలు కూడా ఉంది. వృద్ధులు కూలీలు చేతివేళ్లపై గాయాలు లేదా వేలిముద్రలు స్పష్టంగా లేని వ్యక్తుల పరిస్థితి ఏమిటి అని నేను ఫింగర్‌ప్రింట్‌ గుర్తించలేకపోయినంత మాత్రాన ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి రాకూడదు అందుకే భవిష్యత్తులో ఇలాంటి వ్యవస్థను పరిశీలిస్తే ఫింగర్‌ప్రింట్‌తో పాటు ప్రత్యామ్నాయ సురక్షిత ధృవీకరణ విధానాలు కూడా ఉండాల్సిందే.సాంకేతికత కంటే ప్రజల నమ్మకమే ముఖ్యం బయోమెట్రిక్‌ ఓటింగ్‌ ఆలోచన ఆకర్షణీయంగా కనిపించిన ప్పటికీ దాని అమలుకు ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు అవసరం.బయోమెట్రిక్‌ డేటా భద్రత ఎలా హ్యాకింగ్‌కు అవకాశం లేకుండా ఎలా చూస్తారు ఓటు గోప్యతను ఎలా కాపాడతారు సాంకేతిక లోపం వస్తే ఓటు హక్కు పరిస్థితి ఏమిటి ప్రత్యామ్నాయ ధృవీకరణ ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలతో పాటు స్వతంత్ర నిపుణుల పరిశీలన అవసరం.

ఇ-పేపర్