తెలంగాణ

శ్రీనగర్ కాలనీలో ఘనంగా లక్ష్మీ గణపతి, శని హోమం

శ్రీనగర్ కాలనీలో ఘనంగా లక్ష్మీ గణపతి, శని హోమం

జనం న్యూస్ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి హుజూర్‌నగర్ పట్టణంలోని 19వ వార్డు శ్రీనగర్ కాలనీలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్, టీమ్ 19 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి సన్నిధిలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు లక్ష్మీ గణపతి హోమం, శని హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. గణనాథుడికి విశేష పూజలు నిర్వహించి, లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, ఆయురా రోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. హోమ కార్యక్రమానికి 19వ వార్డు ప్రజలు, మహిళలు, యువతతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో 19వ వార్డు ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ఐకమత్యం వెల్లివిరియాలని కోరుతూ లక్ష్మీ గణపతి, శని హోమాలను నిర్వహించి నట్లు తెలిపారు.హోమ కార్యక్రమంతో శ్రీనగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీమ్ 19 అధ్యక్షులు పొనుగుపాటి సత్యనారాయణ, మైనారిటీ నాయకులు షేక్ సైదా, శాఖమూరి రవి విజయ, మున్సిపల్ కౌన్సిలర్లు సులువా నాగమణి, చంద్రశేఖర్, కూకట్‌పల్లి విలేకరి అనసూరి లక్ష్మణ్, నల్లగొండ సుజాత శ్రీనాథ్, చిట్టిపోతుల రమేష్, న్యాయవాది, మాజీ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు ఎల్లమ్మ వెంకటేశ్వర్లు, వల్లపుదాసు రమేష్, షేక్ మీరా పాషా, వార్డు అధికారి నాగుల్ మీరా, ఆటో రఫీ, మారగాని జ్యోతి శ్రీను, నాగులు మేస్త్రి, రాపోలు కోమలి నాగ ప్రవీణ్, నర్రా రామారావు, గండు నాగమణి, సీత, వల్లపుదాసు కోటయ్య, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వార్డు ప్రజలు, భక్తులు, నిర్వాహకులు, స్థానికులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్