జనం న్యూస్ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ వీధిలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్, గణేష్ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి సహాయ పోలీసు కమిషనర్ నరేష్ రెడ్డి, కూకట్పల్లి పోలీసు ఇన్స్పెక్టర్ డి. స్వామి గౌడ్, ఎస్ఐ చంద్రశేఖర్, నర్మద తదితరులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణనాథునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, కాలనీవాసుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్న రామకృష్ణ వీధి కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. పూజా కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందడం ఆనందదాయకమన్నారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులను రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జే. పురేందర్ రెడ్డి, గణేష్ యువజన కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పురేందర్ రెడ్డి పోలీసు అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గణేష్ యువజన కమిటీ సభ్యులు నందు, అశ్విత్, రిత్విక్, కళ్యాణ్, కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సుధాకర్, ప్రసాద్, చంగల్ రెడ్డి, కేవీ రావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.