జనం న్యూస్, సెప్టెంబర్ 17, జగిత్యాల జిల్లా : మెట్‌పల్లి కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జి డాక్టర్ రఘు మాతృమూర్తి పుప్పలత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దీన్ పాషా గురువారం మెట్‌పల్లిలోని డాక్టర్ రఘు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత పుప్పలత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం డాక్టర్ రఘుతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి తల్లి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. పుప్పలత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఖుతుబోద్దీన్ పాషా మాట్లాడుతూ, కుటుంబంలో పెద్దను కోల్పోవడం తీరని లోటని, పుప్పలత మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో అబ్దుల్ అలీమ్, షేక్ సాజిద్, షేక్ హాజీ, షేక్ వాజిద్, మహమ్మద్ యూనిస్, మహమ్మద్ ముక్తియార్, మహమ్మద్ షబాజ్ తదితరులు పాల్గొన్నారు.