తెలంగాణ

ఎల్లమ్మబండలో ఘనంగా వినాయకుడి ప్రత్యేక పూజలు

ఎల్లమ్మబండలో ఘనంగా వినాయకుడి ప్రత్యేక పూజలు

జనం న్యూస్ సెప్టెంబర్ 18తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డిఎల్లమ్మబండ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎల్లమ్మబండ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సింగ్ యాదవ్ హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో వినాయక భక్త బృందం నిర్వాహకులు చిన్నాల శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, సంపత్, రవి, యాకయ్య గౌడ్, భవాని, శ్రీకాంత్, రాము, కృష్ణ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఇ-పేపర్