తెలంగాణ

యం బి బి యాస్ సీటు సాధించిన విద్యార్థి నరేంద్రర్ కు ఘన సన్మానం

యం బి బి యాస్ సీటు సాధించిన విద్యార్థి నరేంద్రర్ కు ఘన సన్మానం

జనం న్యూస్ 18 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో నివాసం ఉన్నగట్టు మండల కేంద్రానికి చెందిన జ్యోతి నాగరాజు దంపతుల కుమారుడు నరేంద్రర్ కాలేజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్బంగా ఈరోజు శుక్రవారం వారి నివాసంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ మున్సిపల్ కౌన్సిలర్లు విద్యార్థి బి.నరేంద్రర్ కు మిఠాయి తినిపించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థి తల్లిదండ్రులు జ్యోతి నాగరాజు దంపతులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నంత స్థాయికి ఎదిగి పేదలకు సేవ చేయాలని నరేంద్రర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ లతా రామకృష్ణ పులిపాటి వెంకటేష్, గోపాల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిత్తరికిరణ్ కమ్మరిరాము శీను తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్