పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలి
జనం న్యూస్ 23 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగు లాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలి ఈరోజు అయిజ మన కేంద్రంలోని చౌకునందు భవన నిర్మాణ కార్మికుల గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి తనగల ప్రేమ రాజు పి డి యస్ యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉన్న కార్మికులకు పూర్తిస్థాయిలో ఫలితాలు అందడం లేదు రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ బిఓసి కార్డులు లేవు కార్డు తీసుకున్న కార్మికులు రెన్యువల్సు చేసుకోలేకపోతున్నారు కార్డు ఉండి రెన్యువల్ అయినా కార్మికులకు క్లెయిమ్స్ సక్రమంగా అందడం లేదు ఏ రకంగా చూసిన నిరక్షరాసులైన భవన నిర్మాణ కార్మికులకు సులభతరంగా లబ్ధి దొరకడం లేదు దాంతో తీర్వమైన నష్టాలకు గురవుతున్నారు. 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి కార్డు ఉపయోగపడటం లేదు భవన నిర్మాణ కార్మికుడిగా నెలకు1000 చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు చెల్లిస్తున్న ఆ కార్మికుడికి పెన్షన్స్ సౌకర్యం లేదు ప్రభుత్వ వాగ్దానంలో భాగంగా సహజంగానే పెన్షన్లు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కార్మికుడిగా నమోదు చేసుకున్నప్పటికీ పెన్షన్లు ప్రకటించడానికి ప్రభుత్వం వెనకాడుతున్నది చలిలో వణుకుతూ వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ ఆరుగాలం కష్టపడి నిర్మాణాలు ప్రాజెక్టులు పెద్ద పెద్ద బిల్డింగులు చేస్తున్న జాతి నిర్మాణం కోసం కృషి చేస్తున్న పెన్షన్ ఇవ్వడం లేదు 60 సంవత్సరాల పైబడిన వారికి నెలకు 9000 పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. మరియు ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు డెలివరీ మ్యారేజ్ గిఫ్ట్ సహజ మరణం పథకాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈనెల 25 వ తేదీన చలో హైదరాబాద్ ను అన్ని గ్రామాలలో ఉన్న భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘo మండల నాయకులు అనోకు,ప్రేమరాజు దేవేంద్ర తిమ్మప్పసంఘాల గిడ్డయ్యా,సతీష్ పౌలు అనోకు తదితరులు పాల్గొన్నారు