ప్రజల చెరువులపై అక్రమ మట్టి దందా ఆపాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్

May 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 23 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో ప్రజా ఆగ్రహం వెల్లు వెత్తింది అక్రమ మట్టి రవాణాపై అధికార యంత్రాంగం మౌనం అనుమానాలకు తావిస్తోంది జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామ శివారులో గల పెద్ద చెరువును లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు నేడు తీవ్ర ప్రజా ఆగ్రహానికి దారితీశాయి చెరువులోని మట్టిని మాత్రమే కాకుండా చెరువు కట్టను సైతం హిటాచీ యంత్రాలతో తవ్వించి, టిప్పర్లు మరియు ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల రూపాయల ప్రజా సంపదను దోచుకుంటున్నారని గ్రామ ప్రజలు ఆరోపించారు.ఈ అక్రమ మట్టి రవాణాను అడ్డుకునేందుకు గ్రామ ప్రజలు గత మూడు నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అధికార పార్టీ అండతో అక్రమ దందాదారులు మరింత రెచ్చిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే నేడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఒక్కటై హిటాచీలు, టిప్పర్లు ట్రాక్టర్లను అడ్డుకుని అక్రమ మట్టి రవాణాను నిలిపివేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ మాట్లాడుతూ, ప్రజల చెరువులు కళ్లముందే దోపిడీకి గురవుతున్నా రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ, పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. రాత్రింబవళ్లు టిప్పర్లు తిరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో.వ్యక్తమవుతున్నాయని తెలిపారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అధికార హోదా లేని కొంతమంది నాయకులు అధికారులను అడ్డుపెట్టుకుని బహిరంగంగా ప్రజా వనరులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆగ్రహాన్ని చూసి కొంతమంది అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు.అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు ప్రజల సంపదను దోచుకునే వారినే రక్షించడానికి రావడం బాధాకరమని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బింగిదొడ్డి ప్రజలు నేడు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని, ప్రజా వనరులను దోచుకునే రాజకీయ నాయకులను ఇకపై సహించబోమని హెచ్చరించారని చెప్పారు.ఇది కేవలం ఒక గ్రామ సమస్య కాదని, అలంపూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మట్టి–ఇసుక దందాలకు వ్యతిరేకంగా మొదలైన ప్రజా ఉద్యమమని మొరుగు వీరేష్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు, మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ దందాలను పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే రోడ్లెక్కి తమ చెరువులు, భూములు మరియు సహజ వనరులను కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి గంగాధర్ ,రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రంగు తిప్పారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి.జి.కేవెంకటేశ్వరరావు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper