మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్- రైతు డిక్లరేషన్‌కు తర్పణం వదిలిన – మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

May 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్- మే 8- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వారు ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ వినూత్న నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలతో కలిసి రైతు డిక్లరేషన్ ఫ్లెక్సీ లకు, కాపీలకు పిండ ప్రదానం చేసి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం నోముల భగత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలుకు నోచుకోలేదని ఆ హామీలు చనిపోయాయని సూచిస్తూ ఈ పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించినట్లుగా నోముల భగత్ తెలిపారు. ఎకరాకు 15000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పటివరకు రైతులను మోసం చేస్తున్నారని, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీరు, ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు, రైతుల ముఖ్య డిమాండ్లు అయిన రైతు డిక్లరేషన్ లో పేర్కొన్న ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని, కౌలు రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎదురవుతున్నారు ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నోముల భగత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు
తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper