తెలంగాణ

ఏర్గట్లలో సంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

ఏర్గట్లలో సంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

జనం న్యూస్, సెప్టెంబర్ 24: ఏర్గట్ల మండల కేంద్రంలో గంగపుత్ర యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగపుత్ర యువకులు సంప్రదాయబద్ధంగా మంగళహారతులు పట్టుకొని శోభాయాత్ర చేపట్టారు. వల గొడుగులు పట్టుకొని యువకులు, భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. గణపతి నామస్మరణలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేసి, కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు. గంగపుత్ర యూత్ సభ్యులు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఇ-పేపర్