జనం న్యూస్ | : మైనర్ బాలికలను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడిని బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు బహిరంగంగా అవమానించి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పవన్ అలియాస్ సోనూ అనే యువకుడు ముగ్గురు మైనర్ బాలికలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత బాలికల ఆరోపణల ప్రకారం.. వారు పాఠశాలకు వెళ్లే సమయంలో పవన్ తరచూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, వారిలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పవన్‌ను పట్టుకుని బహిరంగంగా నగ్నంగా ఊరేగించి, స్థానికుల సమక్షంలో కొట్టినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు పవన్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు, అలాగే నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ కింద కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.