ఆంధ్రప్రదేశ్

తుఫాను ప్రభావంతో నేలకొరిగిన చెట్లు

తుఫాను ప్రభావంతో నేలకొరిగిన చెట్లు

అధికారుల అప్రమత్తతతో వెంటనే తొలగింపు.. సాఫీగా రాకపోకలు జనం న్యూస్ , సెప్టెంబర్‌ 25 కోటబొమ్మాళి మండలం :గత మూడు రోజులుగా ‘ఆర్నాబ్‌’ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరుగుతున్నాయి. ఈ క్రమంలో రేగులపాడు సమీపంలో భారీ వటవృక్షం రహదారిపై కూలిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక తహసీల్దార్‌ సి.హెచ్‌. ఎస్‌. వి. కె. ప్రసాదరావు, ఎస్‌ఐ వి. సత్యనారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రహదారిపై పడిన చెట్టును తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టడంతో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. కోటబొమ్మాళి–జలుమూరు ప్రధాన రహదారిపై చెట్టు కూలడంతో కొద్దిసేపు వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అదేవిధంగా గురువారం రాత్రి హరిశ్చంద్రపురం రహదారిలోనూ ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. సమాచారం అందుకున్న ఆర్‌అండ్‌బీ అధికారులు రాత్రికిరాత్రే యుద్ధప్రాతిపదికన చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.తుఫాను నేపథ్యంలో మండలస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అత్యవసర ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారుల సమన్వయంతో సమస్యలను వెంటనే పరిష్కరిస్తుండటంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇ-పేపర్