జనం న్యూస్ సెప్టెంబర్ 27: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం లోని తాళ్లరాంపూర్ గ్రామంలోని నవ్యభారతి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.కార్యక్రమానికి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వై. శ్రీనివాస్, ఏర్గట్ల ఎస్బీఐ మేనేజర్ జయప్రకాశ్, తాళ్లరాంపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సంధ్యారాణి, సీనియర్ న్యాయవాది జగన్, గంగాధర్, మాజీ సర్పంచ్ మాలకొండ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా చీఫ్ ఇన్స్ట్రక్టర్ జోగు శివాని, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి పసునూరి అవినాష్, ఇన్స్ట్రక్టర్లు తిరుమల, శోభన్, వీరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే శిక్షణ అందిస్తున్నారు. ముఖ్య అతిథులు విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు, ప్రతిభా పురస్కారాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కరాటే వంటి ఆత్మరక్షణ విద్యల్లోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు. కరాటే ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని తెలిపారు.పాఠశాల కరస్పాండెంట్ ఏనుగందుల రాజపూర్ణానందం మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, కరాటేకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, కరాటే ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.