ఆంధ్రప్రదేశ్

అయిజ కు శాంక్షన్ అయినటువంటి కోర్టును గద్వాలలో ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

అయిజ కు శాంక్షన్ అయినటువంటి కోర్టును గద్వాలలో ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

జనం న్యూస్ 28 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు .రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అయిజ కు శాంక్షన్ అయినటువంటి జూనియర్ సివిల్ కోర్టు గద్వాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసినది గద్వాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే భవనం ను కేటాయించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసినది లక్షకు పైగా జనాభా ఉన్నటువంటి అయిజ పట్టణం మండలం జనాభా, ను కేసులను దృష్టిలో పెట్టుకొని అయిజ శాంక్షన్ అయితే కొందరి స్వార్థం కోసం గద్వాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసినది అయిజ నుంచి గద్వాలకు కక్షిదారులు వెళ్లి రావాలంటే చాలా వ్యయప్రాయాసాలు అవుతాయి వెంటనే మాకు కేటాయించిన కోర్టు ను మా అయిజ పట్టణంలోని ప్రారంభించాలి. స్థానిక యం యల్ ఎ యం పి యం యల్ సి ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్,ప్రభుత్వ యంత్రాగం వెంటనే స్పందించి అయిజ త్వరగా ప్రారంభించాలని లేనిపక్షంలో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. అదేవిధంగా దీనితోపాటు గతంలో అయిజ కు శాంక్షన్ అయినటువంటి ఎస్సీ గురుకుల పాఠశాల ను ఎర్రవల్లికి రోడ్ కుగత 10 సంవత్సరాల క్రితం తరలించడం జరిగినది ఇప్పటివరకు ఎన్నో పర్యాయాలు పలు రకాల పోరాటం చేస్తే కూడా ఇప్పటివరకు ఆ యొక్క స్కూలు అయిజ కు రాలేదు అదేవిధంగా ఆర్ డి యస్ కార్యాలయాలు గత 70 సంవత్సరాల నుంచి అయిజ మండలం ఉప్పల క్యాంపులో కొనసాగినవి ఆ కార్యాలయం కూడా గద్వాలకు గత ఆరు సంవత్సరాల క్రితం తరలి వెళ్లినాయి వాటిపై కూడా ఏ ప్రజాప్రతినిధి అదేవిధంగా అధికార పార్టీ ఎలాంటి స్పందన లేక ఇప్పటివరకు ఆ కార్యాలయాలు అక్కడే నడుస్తున్నాయి ఆర్డిఎస్ కార్యాలయము అధికారుల కోసమా రైతుల కోసమా అర్థం కావడం లేదు రైతులు మొత్తం అలంపూర్ నియోజకవర్గం ఉంటే గద్వాల లో కార్యాలయం పెట్టడం ఏమిటి ఉప్పల క్యాంపు లోని పెట్టాలని వారు హెచ్చరించారు. కాబట్టి తరలిన రెండు కార్యాలయాలు మరియు రాబోయే కోర్టు అయిజ లోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగినది లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున కార్యచరణ సిద్ధం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో అయిజ పట్టణ మండల అధ్యక్షులు తెలుగు నరసింహ గోపాల కృష్ణ నాయకులు లక్ష్మణ్ గౌడ్ తుముకుంట అంజి రజక నర్సింహ శ్రీకాంత్ ముదిరాజ్ లు పాలుగొన్నారు.

ఇ-పేపర్