టిఆర్ఎస్ పార్టీ నాయకులను పరామర్శించిన

May 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 25 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ *మల్దకల్:* మండలంలోని అడవిరావుల చెరువు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్ గుండన్న ని మరియు మల్దకల్ మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్ కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యం అందించారు. అలాగే సద్దనోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల రాము తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి టిఆర్ఎస్ పార్టీ తరపున వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు,జిల్లా కార్యదర్శి లవన్న మరియు యన్ యచ్ పి యస్ మండల అధ్యక్షులు బి విష్ణు గ్రామ సర్పంచ్ కృష్ణమీసాల కిష్టన్న తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper