కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

May 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం యన్ కె యన్ ఆర్ గార్డెన్స్ లో జరిగింది.. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు… ముందుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాటి మంత్రిగా కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని… బాల నగర్, జేఎన్టీయూ, కైతలాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం, అండర్పాస్ బ్రిడ్జ్ లు, మంచినీటికి ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంకులు.. ఎస్టీపి ప్లాంట్లు.. నూతన డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ ఓపెన్ జిమ్లు ,పార్కులు ,ఇలా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క అభివృద్ధి పని కూడా ముందుకు వెళ్లలేదని ఇంకా సిగ్గు లేకుండా బాలనగర్ ఫ్లైఓవర్ ,కైతలాపూర్ ఫ్లై ఓవర్లు మేము నిర్మించామని చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు… ఆనాడు నిధులు కొరత లేకుండా నెలకి 30 కోట్లు వరకు మంజూరు చేసేవారని కానీ నేడు రెండున్నర సంవత్సరాలు గడిచినా కూడా ఇరవై ఐదు కోట్లు కూడా నిధులు మంజూరు కావడం లేదని ..దీంతో ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు… అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.. అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఎస్. ఐ .ఆర్ కు సంబంధించి ఓట్లు తొలగింపు ప్రక్రియలో అవకతవకలకు సంబంధించి ప్రజలకు అర్థమయ్యేటట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు …ఓటు మీ హక్కు అంటూ ప్రజలకు ఓటు యొక్క ఆవశ్యకత వివరిస్తూ ఇంటికి ఎస్ఐఆర్ నమోదుకు సంబంధించి సంబంధిత అధికారి వచ్చినప్పుడు ఏ విధంగా వారికి వివరించాలి.. అన్నది కేటీఆర్ గారు ప్రజలకు చెప్పడం జరిగింది.. అలాగే గతంలో కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని ..ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో కార్యకర్తలు సైనికుల్లాగా పని చేస్తూ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ స్థానం మాధవరం కృష్ణారావు కి ఇచ్చారని.. భవిష్యత్తులో కూడా లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు అందరూ ఒకే తాటిపై ఉండి ముందుకు వెళ్లడం ఆదర్శంగా తీసుకోవాలని.. కష్ట కాలంలో పార్టీ కండగా ఉండే వారిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని.. భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని …ఏ ఒక్క కార్యకర్తను కూడా ఇకమీదట వదిలిపెట్టేది లేదని వారందరినీ ఆదుకునే బాధ్యత బిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ప్రకటించారు… ఎవరైతే కష్టపడతారో.. ప్రజల్లో ఉంటా రో వారికి కార్పొరేటర్ టికెట్టు కచ్చితంగా వస్తుందని భరోసా ఇచ్చారు.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఏ విధంగా ఇచ్చాము.. ఇరవై నాలుగు గంటలు మంచినీరు ఇచ్చే బాధ్యత కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయిన నిర్మించిందా అని ప్రశ్నించారు… ఒకవేళ నిర్మించినట్టు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు… ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే వివేక్ ,ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, గజ్జల నాగేష్, రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా… నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ ,మందడి శ్రీనివాసరావు, పగుడాల శిరీష బాబురావు, పగుడాల బాబురావు, తూము శ్రావణ్ కుమార్, సబియా గౌసుద్దీన్, మహేశ్వరి శ్రీహరి ,మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షులు సెక్రెటరీలు,మహిళా నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper