సుప్రీం సీరియస్* 2,700 క్యాన్సర్ మందును 27,000కు అమ్మకం 16 శాతం మార్జిన్ అమలు చేయాలన్న సుప్రీం
న్యూఢిల్లీ జనం న్యూస్. మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంచార్జ్ తేదీ 30/09/2026. న్యూఢిల్లీ: విపరీతంగా పెరుగుతున్న, పారదర్శకత లేని ఔషధాల ధరలు సామా న్యుడికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ప్రకటించిన రిటైల్ ధరలకు ఆసుపత్రులు వసూలు చేస్తున్న ధరకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. క్యాన్సర్ మందు ఖరీదు 2,700 ఉంటే, 27,000 రూపాయలకు విక్రయిస్తు న్నారని కోర్టు తెలిపింది. అన్ని మందులపై ఏకరీతిలో 16 శాతం మార్జిన్ను వర్తింపచేయాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. తమ సొంత ఫార్మసీల నుంచే ముందులు కొనుగోలు చేయాలని బలవంతం చేసే ఆసుపత్రులపై విచారణ జరపాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. ఇటువంటి పద్ధతులు రోగులకు, పన్ను చెల్లింపుదారులకు భారం అవుతాయని వ్యాఖ్యానించింది. క్యాన్సర్ మందును రిటైలర్లకు 2,700 రూపాయలకే సరఫగా చేస్తున్నప్పటికీ, ఎంఆర్పి 27,000గా నిర్ణయించడాన్ని జస్టిస్ విక్రమ్నాథ్, జసస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ప్రభుత్వ పథకం కింద చికిత్స పొందుతున్న సమయంలో పన్ను చెల్లింపు దారులపై భారం పడుతుందని కోర్టు పేర్కొంది. డ్రగ్స్ కంట్రోల్ ఆర్డర్ 2013 కింద మందుల ధరలు, జెనరిక్ ప్రిస్కిప్షన్, వైద్య పరికరాల నియంత్రనపై దాఖలైన పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది. ఎంఆర్పీపై 16 శాతం మార్జిన్ పై ప్రభుత్వ అధికారులతో చర్చిస్తామని, విషయాన్ని పరిశీలించడానికి రెండు వారాల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు ఈ భారీ ధరల తేడాను పగటిపూట దోపిడీగా అభివర్ణించింది. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని కోర్టు ప్రశ్నించింది.