తెలంగాణ

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ నవంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లిలోని ఎన్.కే.ఎన్.ఆర్. గార్డెన్స్‌లో అంకర్ల వారి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రుడు రాము ఆహ్వానం మేరకు ఈ వివాహ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు పూజశ్రీ, హరికిరణ్‌లను ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతుల జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహ వేడుకలో ఆయన పాల్గొనడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇ-పేపర్