ఉపాధి కూలీలను రెండుసార్లు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలి
ఉపాధి కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పర్యటించాలి
జనం న్యూస్ మే 14 చిలిపిచేడు మండల ప్రతినిధి ; మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం మే 15న నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలంలోని మాదాపూర్ తుల్జారంపేట తో పాటు వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పని ప్రదేశాలను సందర్శించి కూలీలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పర్యవేక్షత బాధ్యత పంచాయతీ కార్యదర్శులు దేనాని ప్రభుత్వం నిర్ణయం చేసిందని అన్నారు పంచాయతీ కార్యదర్శులు పని ప్రదేశాలను సందర్శించాలని డిమాండ్ చేశారు ఉపాధి పనికి సంబంధించి ఏడు రకాల రిజిస్టర్ లను పంచాయతీ కార్యదర్శులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన మండలంలో ఎక్కడ అమలు కావడం లేదని అన్నారు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అమలు చేస్తున్న రెండుసార్లు ఫోటో క్యాప్చర్ విధానం వలన కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఫోటో రాకపోవడం వలన కొద్ది మంది కూలీలు చూడ డబ్బాలను వెంట తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు గ్రామాల్లో పని ప్రదేశాల్లో టెంటు వాటర్ మెడికల్ కిట్టు సౌకర్యం లేదని అన్నారు పనిచేసినప్పటికీ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అలాగే ఎండలో పనిచేస్తున్న కూలీలకు చేతులకు బొబ్బలు వస్తున్నాయని అన్నారు ప్రతివారం కూలీలకు డబ్బులు రాకపోవడం వలన తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని చట్టంలో ఉన్న ఎందుకు అమలు చేయడం లేదని అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన విధానాల వలన పనికి హాజరయ్యి పోలీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని పని ప్రదేశాలను అధికారులు సందర్శించడం లేదని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో కీలకంగా ఉన్న మెట్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు జారీ చేసి పని కల్పించాలని డిమాండ్ చేశారు గడ్డపార గంపలు, పారలు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు దూర ప్రాంతం వెళ్లి పనిచేసే రవాణా చార్జీలు చెల్లించాలని చట్టంలో ఉందని అన్నారు పాత పద్ధతిలోనే నరేగా కొనసాగించాలని డిమాండ్ చేశారు పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన గ్రామాల్లో సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలపై ఉందని అన్నారు కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వీజీ జి రామ్ జి ఉపాధి కూలీలను పనికి దూరం చేస్తుందని అన్నారు దీని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉపాధి హామీ పథకంలో వస్తున్న సమస్యలు పరిష్కారం చేయాలని బకాయి వేతనాలు చెల్లించాలని రెండుసార్లు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని పని ప్రదేశంలో టెంట్ వాటర్ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మే 15న నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపాధి హామీ కూలీలు బిక్షపతి రవీందర్ నర్సింలు ముశ్రాత్ రాజు ఎల్లమ్మ రెబీనా తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు