ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ రేబ్బస్ మహేష్
మెట్ పల్లి పట్టణంలోని 11వ వార్డు వెంకట్రావుపేట్ నూతన డ్రైనేజ్ పనులు ప్రారంభం.
వార్డ్ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మెట్ పల్లి చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ , కౌన్సిలర్లు.
జనం న్యూస్, మే 11, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: పట్టణంలోని 11వ వార్డు అయిన వెంకట్రావుపేటలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కాలనీలో ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి కాలనీలో నూతన డ్రైనేజీ పనులను ప్రారంభించరు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్. వార్డులో కేవలం డ్రైనేజ్ పనులు కాకుండా సి సి రోడ్డు పనులకు పలు ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు . దాదాపు కోటి 30 లక్షల బడ్జెట్ తో వార్డును సుందరి కారణంగా చేస్తాను అని తెలిపారు. ప్రస్తుతానికి వార్డు ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఎక్కడుందో అక్కడ పని మొదలు పెట్టారు. ఇక ముందు కూడా వార్డు శుభ్రత వార్డు సుందరి కరనే ధ్యేయంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇట్టి బడ్జెట్ కి సహకరించిన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగరావు కి మరియు చైర్మన్ మైలారపు లింబాద్రికి కృతజ్ఞత భావం తెలిపారు . తదుపరి నూతన డ్రైనేజ్ కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో , చైర్మన్ మైలారపు లింబద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.