తెలంగాణ

ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి యు ఎస్ ఎఫ్ ఐ

ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి యు ఎస్ ఎఫ్ ఐ

జనం న్యూస్ ;28 అక్టోబర్ బుధవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;ఎస్సీ, బిసి సంక్షేమ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత ఎల్ నినో ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రానున్న వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి మరియు బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారులకు యు ఎస్ ఎఫ్ ఐ బృందం వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగ జిల్లా కార్యదర్శి గుడికందుల రవి మాట్లాడుతూ, భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో హాస్టళ్లలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. బోర్లు ఎండిపోకముందే ట్యాంకర్లు, మిషన్ భగీరథ ద్వారా నిరంతర తాగునీరు అందించాలి.నల్లాల లీకేజీలను అరికట్టి నీటి వృథాను నివారించాలి.బట్టలు ఉతికిన, వాడిన నీటిని నిలవకుండా గార్డెనింగ్‌కు మళ్లించి డెంగ్యూ, దోమలను అరికట్టాలి.మార్కెట్‌లో పెరిగిన ధరల వల్ల భోజన నాణ్యత తగ్గకుండామెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి.ప్రతి హాస్టల్‌లో వర్షపు నీటి ఇంకుడు గుంతలు నిర్మించాలి.సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులను సమీకరించి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్